జన్వాడ రేవ్‌ పార్టీలో A1గా కార్తీక్‌, A2 గా రాజ్ పాకాల – చేవెళ్ల ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్

-

జన్వాడ ఫాం హౌజ్‌ పార్టీపై చేవెళ్ల ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ శ్రీలత కీలక ప్రకటన చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఫామ్ హౌస్ సూపర్వైజర్ కార్తిక్ ను A1 గా, A2 గా రాజ్ పాకాల ను చేర్చామని వివరించారు. నిబంధనలు ఉల్లగించి పార్టీ నిర్వహించారని ఆగ్రహించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ కి చెందిన లిక్కర్ తో పాటు ఫారిన్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

rave-party

ఈవెంట్ అనుమతి లేకుండా చేశారని… రాజ్ పాకాల పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. 7 లీటర్ల ఫారిన్ లిక్కర్ ను సీజ్ చేశామన్నారు. విచారణలో మరి కొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. విదేశీ మద్యాన్ని ఎయిర్ పోర్ట్ నుండి తీసుకొచ్చినట్లు గుర్తించామన్నారు. ఈ ఏరియా కి సంబంధించిన లిక్కర్ మాత్రమే కొనాలన్నా నిబంధన ఉన్నా.. అతిక్రమించి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన డ్యూటీ ఫ్రీ లిక్కర్ పార్టీ లో సేవించారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version