బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. గాంధీ ఇప్పుడు నా ఇంటికి వస్తే మోస్ట్ వెల్కమ్..అని…. భోజనం చేసి తెలంగాణ భవన్ కు వెళ్లి ఇద్దరం ప్రెస్ మీట్ పెడుతామని తెలిపారు. కేసీఆర్ దగ్గరికి కలిసి వెళ్తామని వివరించారు. రేపే ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి పోతామని…బీఆర్‌ఎస్ నేతలందరం కలిసి..గాంధీ ఇంటికి వెళతామన్నారు. ఉదయం 5 నుంచే నన్ను ప్రివెంటివ్ అరెస్ట్ చేశారని తెలిపారు.
రేపు మేడ్చల్ BRS పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలతో కలిసి గాంధీ ఇంటికి పోదామని పిలుపునిచ్చారు. BRS లోనే ఉన్నానని అంటున్నారు కదా.. నేను మీ పార్టీ సహచర ఎమ్మెల్యేను నేను మీ ఇంటికి వస్తే భయమేంటి..ఇద్దరం కలిసి BRS కండువా వేసుకుని తెలంగాణ భవన్ తో ప్రెస్ మీట్ పెడుదామని వివరించారు. పార్టీ మారనప్పుడు జెండా వేసుకుంటే తప్పేంటి అని… రేవంత్ ను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరానని చెప్పావని వివరించారు. చంద్రబాబును మోసం చేశామని… కేసీఆర్ ను మోసం చేసావు.. ఈ రోజు కాంగ్రెస్ లో చేరావని వివరించారు. 39 ఏళ్ల యువకుడిని.. 70 ఏళ్ల ముసలోనివి నువ్వు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో అంటూ ఆగ్రహించారు.