కనిపించని నాలుగో సింహమే…సీఎం కేసీఆర్ అని కొనియాడారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళా భద్రత సంబరాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… మహిళల భద్రత బాధ్యత సీఎం కేసీఆర్ దేనని పేర్కొన్నారు.
కేసీఆర్ కనిపించని నాలుగో సింహం అని తెలిపారు. అడబిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని.. తెలంగాణ స్పూర్తితో 18 తెలంగాణ రాష్ట్రాల్లో షీ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సురక్షదినోత్సవం నిర్వహించడం జరుగుతుంది…పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఇంత పెద్ద బిల్డింగ్ ఇవ్వడంతో పాటు అధునాతన సాంకేతికత అందిస్తున్న ప్రభుత్వం… ఇలా పోలీస్ వారికి ఇస్తారని ఎప్పుడు ఊహించలేదన్నారు.