తెలంగాణ తరహా పాలన, పథకాలు కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, విద్య, వైద్యం, సంక్షేమ, ఉపాధి రంగాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వనపర్తిలో ఆయన మాట్లాడుతూ…’ఒకనాడు ఆకలితో అల్లాడిన తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ సాధించిన విజయాలకు తార్కాణాలు అని పేర్కొన్నారు.
కాగా, వానకాలం సీజన్ కు రైతుబంధు కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని గతంలో కంటే ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకొనున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లకు ఎకరానికి రూ. 5000 చొప్పున ఏటా రూ. 10వేల సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వానాకాలం సీజన్ కు జూన్ చివర్లో, జూలై మొదటి వారంలో నిధులు విడుదల చేస్తుండగా, ఇకపై ముందుగానే అందించనుంది.