‘ఇండియన్ ఐడల్ సీజన్-2’ విన్నర్​కు అల్లు అర్జున్ సూపర్ ఆఫర్

-

బాలీవుడ్​లో ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఆ షో మాదిరి తెలుగులో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ షో షురూ చేసింది. ఇప్పటికే సీజన్ 1 పూర్తై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక సీజన్-2 కూడా పాపులారిటీ సంపాదించుకుని ఈ ఆదివారం రోజున ఫినాలే పూర్తి చేసుకుంది. ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్-2 విన్నర్​గా విశాఖపట్నానికి చెందిన గాయని సౌజన్య విజేతగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో జ‌య‌రామ్ (ఫస్ట్ రన్నరప్), మూడో స్థానంలో లాస్య ప్రియ‌ (సెకండ్ ర‌న్న‌ర‌ప్‌)లుగా నిలిచారు.

గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌ ఫైనల్‌కు వచ్చిన కంటిస్టెంట్స్‌ను ప్రశంసించారు. అనంతరం ఈ సీజన్‌కు విజేతగా నిలిచిన సౌజన్యకు టైటిల్‌తో పాటు రూ.10 లక్షల నగదు ప్రైజ్​మనీని అందజేశారు. అంతే కాదు సౌజన్యపై ఐకాన్ స్టార్ ప్రశంసలు కురిపించారు. ‘‘మీరు టైటిల్‌ గెలుచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే, పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించడం సాధారణంగా జరుగుతుంది. కానీ, భర్త, అత్తింటి వాళ్లు సపోర్ట్‌ చేస్తే ఒక మహిళ గొప్ప విజయాలు అందుకోవచ్చని మీరు నిరూపించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. నేను మీకో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నా భార్యకు ఒక ఫొటోషూట్ కంపెనీ ఉంది. అందులో మీ పాపకు, ఫ్యామిలీ మొత్తానికి ఫొటోషూట్‌కు నేను ఛాన్స్‌ ఇస్తున్నాను. ’’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news