అసెంబ్లీ లో ప్రభుత్వం కేఆర్ఎంబీ పై తీర్మానం పెట్టాలి – కవిత

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం కేఆర్ఎంబీ పై తీర్మానం పెట్టాలని డిమాండ్‌ చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ‘గతంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ శాసనసభ, మండలిలో తీర్మానం తీసుకురండి. సంపూర్ణ హక్కులు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలన్న తీర్మానాన్ని కేంద్ర జలశక్తి శాఖకు పంపించండి. దీనికి బీఆర్ఎస్ మద్దతిస్తుంది’ అని కవిత ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కావాలనే ఉద్దేశ్యంతోనే ఏర్పాటు చేసుకున్నామని..కానీ దురదృష్టవశాత్తు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆంధ్ర ప్రాంత వాసులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారని ఆగ్రహించారు.ముఖ్యమంత్రి వద్ద ఉండే..మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగంలో కర్నూల్ ప్రాంతానికి చెందిన ఎ.రామిరెడ్డి కుమారుడు రఘునాథ్ రెడ్డి తెలంగాణ ప్రాంత వాసి కాకపోయినప్పటికీ 2007 go ను కోట్ చేస్తూ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నరు కవిత.

Read more RELATED
Recommended to you

Latest news