కెసిఆర్ పార్థసారథి దగ్గర వేలకోట్లు దాచి పెట్టి ఉంటాడు, అందుకే రాజ్యసభకు పంపాడు: జగ్గారెడ్డి

హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి కి రాజ్యసభ సీటు ఖరారు చేయడం పట్ల సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో ప్రజా పరిపాలన కాదు బిజినెస్ పాలన నడుస్తుంది అన్నారు. టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుల ఎంపిక లో విలువలు పోగొట్టుకుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం కోసమే వేల కోట్లు ఉన్న పార్థసారథికి రాజ్యసభ సీటు ఇచ్చాడని విమర్శించారు జగ్గారెడ్డి.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

కరోనా సమయంలో రెమిడీసివర్ తయారు చేసిన కంపెనీ లో 500 కోట్లు ఎలా దొరికాయని, ఇంకా కనపడని వేల కోట్లు ఉన్నాయని ఆరోపించారు. ప్రజల రక్తాన్ని పీల్చి సొమ్ములు దాచుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. పార్థసారధి వెనుక పెద్ద స్కామ్ ఉందని, ఆయన దగ్గర కెసిఆర్, టిఆర్ఎస్ వేల కోట్లు దాచిపెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. అందుకే పార్థసారథిని రాజ్యసభకు పంపి ఉంటారని అన్నారు.