Delhi Liquor Scam: కవిత బెయిల్ కేసులో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు..!

-

కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు. ఈడీ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు.. కోర్టులో ఈడి న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని…శ్రీనివాసులు రెడ్డిని కేసీఆర్ పేరుకు అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు.

KCR Knew About Liquor Scam Along With Kavitha

రాఘవ రెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనలను కవిత తండ్రి కేసీఆర్ అని మీడియా తప్పుగా అన్వయించింది…ఎక్కడా కూడా కెసిఆర్ గారి పేరు రాయలేదు.. వాదనల సందర్భంగా ఈడి మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించిందని…. సంబంధిత వాంగ్మూల పత్రాన్ని బహిర్గతం చేశారు న్యాయవాది మోహిత్ రావు. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులురెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న వారిని పరిచయం చేశానని చెప్పారు…కొందరు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news