ఇప్పటి నుండి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతా :కేసీఆర్

బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ మీడియా కాన్ఫరెన్స్ తర్వాత మరోసారి ఈరోజు కెసిఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… వరి ధాన్యం పండించాలని చెబుతున్నారని కానీ కేంద్రం చేత కొనిపిస్తావా అని అడిగితే దానికి సమాధానం ఇవ్వలేదని అన్నారు. ముందు దానికి సమాధానం ఇవ్వాలని కేసీఆర్ అన్నారు.

KCR-TRS
KCR-TRS

ఏది పడితే అది మాట్లాడుతుంటే ఊరుకునేది లేదని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనుండి తానే ప్రతిరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతాను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అంటూ బండి సంజయ్ ని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నావ్ అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.