నేడు జడ్చర్ల, మేడ్చల్‌లో కేసీఆర్ బహిరంగ సభలు

-

ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ మరో రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తోలుత జడ్చర్ల, ఆ తర్వాత మేడ్చల్ లో జరిగే బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని గులాబీ బాస్ ప్రసంగించనున్నారు.

cm kcr

జడ్చర్ల గంగాపూర్ రోడ్డు శివాలయం సమీపంలో సభను నిర్వహించనుండగా…. మేడ్చల్ లో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 15 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కాగా, నిన్న సిద్ధిపేట, సిరిసిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను..నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా సిద్దిపేట గడ్డ అన్నారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. ఈ మాట అన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు.

సిద్దిపేట పేరు విన్నా.. సిద్దిపేట భూమికి వచ్చినా.. సిద్దిపేట నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాదింది. చదువు చెప్పింది. నాకు రాజకీయ జన్మనిచ్చిందని వెల్లడించారు. సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్, అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావు గారికి గతంలో వచ్చిన రికార్డు మెజారిటీని తిరగరాస్తూ.. భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version