మెదక్ పోరు..కాంగ్రెస్‌లో లొల్లి..కారు డౌన్.!

-

మెదక్ అసెంబ్లీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. మొన్నటివరకు బి‌ఆర్‌ఎస్ లో వర్గ పోరు అన్నట్లు పరిస్తితి. కానీ ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు అనే పరిస్తితి. ఇలా సమీకరణాలు మారడానికి కారణం మైనంపల్లి హనుమంతరావు. బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఆయనకు మల్కాజిగిరి సీటు ఫిక్స్ అయిన సరే..తన తనయుడు రోహిత్‌కు మెదక్ సీటు ఇవ్వలేదని అసంతృప్తిలో ఉన్నారు.  తన తనయుడుకు సీటు రాకుండా హరీష్ రావు అడ్డుకున్నారని చెప్పి తీవ్ర విమర్శలు చేశారు.

ఆ తర్వాత కొన్ని రోజులు రాజకీయంగా వ్యూహాలు రచించి..చివరికి కాంగ్రెస్ లో రెండుసీట్లు ఖాయం కావడంతో ఆ పార్టీలోకి జంప్ చేశారు. మైనంపల్లి మల్కాజిగిరీలో, రోహిత్ మెదక్ సీటు నుంచి పోటీ చేయనున్నారు. దీంతో పోరు రసవత్తరంగా మారింది. అటు బి‌ఆర్‌ఎస్ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. ఇటు కాంగ్రెస్ నుంచి రోహిత్ పోటీ చేయనున్నారు. బి‌జే‌పి నుంచి క్లారిటీ లేదు. కానీ బి‌జే‌పి పెద్ద పోటీ కాదు.

ప్రధాన పోరు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది. అయితే రెండు సార్లు బి‌ఆర్‌ఎస్ నుంచి గెలిచిన పద్మాకు ఈ సారి సానుకూల పవనాలు లేవు. వ్యతిరేకత ఉంది. అదే సమయంలో బి‌ఆర్‌ఎస్ లో ఓ వర్గం ఇప్పుడు మైనంపల్లి వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. దీంతో బి‌ఆర్‌ఎస్ ఓట్లు తగ్గుతాయి. అయితే మైనంపల్లి వారసుడుకు సీటు ఇవ్వడంతో అక్కడున్న కాంగ్రెస్ నేత కంటారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

పదేళ్లుగా పార్టీకి సేవ చేసిన పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు..ఈయన బి‌ఆర్‌ఎస్ లోకి వెళుతున్నారు. దీంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే ఆర్ధికంగా, సామాజికంగా మైనంపల్లి వారసుడు బలమైన నేత. అటు సొంత వర్గం ఉంది. ఈ అంశాలు మైనంపల్లికి కలిసొస్తాయి. మొత్తానికి మెదక్ లో మాత్రం హోరాహోరీ పోరు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news