కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్ల రిటర్మెంట్ వయసు పై కెసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
జూనియర్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్ల రిటైర్మెంట్ వయసును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వారి పదవి విరమణ వయసు… 61 సంవత్సరాలు ఉండగా… దాన్ని 58 సంవత్సరాలకు తగ్గించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో కాంట్రాక్టు లెక్చరర్లకు బిగ్ షాక్ తగలనుంది. దీనిపై కాంట్రాక్టు లెక్చరర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.