కేసీఆర్ సంచలన నిర్ణయం… ఇక ప్రజలందరికీ పరీక్షలు!

-

కరోనా మహమ్మారి విషయంలో కేసీఆర్ లాక్ డౌన్ మొదలైన నాటి నుంచీ సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు! ఈ విషయంలో కేంద్రం అలా చెప్పిందనో, పక్క రాష్ట్రాలు ఇలా చేశాయనో కాకుండా… తనకు అనిపించిన విధంగా కరోనా మహమ్మారి విషయంలో ఏమాత్రం లైట్ తీసుకోకుండా తెలంగాణ ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు!

అవును… తెలంగాణలో ఒకరోజు అతి తక్కువగా, మరో రోజు ఊహించని విధంగా పాజిటివ్ కేసులు చూపిస్తూ దోబూచులాడుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని భౌతిక దూరంతో ఎంత కంట్రోల్ చేద్దామన్నా విస్తరిస్తూనే ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా… ఇక నుంచి కరోనా వైరస్ పై ప్రజలు ఆస్పత్రులకు రాకుండా.. వైద్య సిబ్బందే ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ తాజాగా వైద్యాధికారులు ఆస్పత్రుల సూపరిటెండెంట్లు మెడికల్ ఆఫీసర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కేసీఆర్ తో చర్చించి ప్రతీ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యసిబ్బందిని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఏఎన్ఎంల సేవలు పూర్తిగా వినియోగించుకోవాలని భావించిన తెలంగాణ సర్కార్… ఒక్కో ఏఎన్ఎంకు 100 ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా… తెలంగాణలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా వంటి లక్షణాలు ఉన్న వారికి తప్పనిసరిగా పరీక్షలు చేయాలని మంత్రి సూచించారు. దీంతో… తెలంగాణ ప్రజలందరికీ మూడు నాలుగు రోజుల్లోనే వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news