బిజెపి రాష్ట్ర పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది.
సుష్మాస్వరాజ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు నల్ల ఇంద్రసేన రెడ్డి, తుల ఉమ, పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. మునుగోడులో బిజెపి గెలిస్తే తెరాస నుంచి పోటీ చేసే అభ్యర్థులు మిగలరని అన్నారు ఇంద్రసేన రెడ్డి.
కాబట్టి కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో ఉన్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణ ప్రజలు తెరాస ను గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్మశాన వాటికలకు ఎక్కడైనా జిఎస్టీ వేశారా? వేస్తామని చెప్పారా? అని ప్రశ్నించారు. తెరాస సర్కార్ అసత్య ప్రచారాలు చేస్తోందని. దేశంలో అత్యంత అబద్దాలు చెప్పే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం మాత్రమేనని అన్నారు