రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని వదిలేదే లేదన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. శనివారం ఈటెల మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ డబ్బు సంచులతో రాజకీయం మొదలుపెట్టిందని విమర్శించారు. నాలుగు నెలల క్రితమే ఈ తథంగానికి తెరలేపిందని.. దీనికోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. కెసిఆర్ పాలన పై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని అన్నారు ఈటెల.
జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఇక ఇంటికి పోవడం ఖాయం అన్నారు. కెసిఆర్ కి దావత్ ల మీద, లిక్కర్ మీద నమ్మకం ఉందని.. ప్రజల సేవ మీద లేదన్నారు. అసలు కెసిఆర్ కి పేదలు ఉన్నారనే ఆలోచన కూడా లేదన్నారు. ఆయనకి కుటుంబ పాలన, ఆదాయం, పదవులు ఉంటే చాలని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా సరైన న్యాయం చేస్తుందన్నారు.