తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. విద్యార్థులకు మరో ఛాన్స్

-

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. రూ. 2వేల ఆలస్య రుసుముతో మంగళవారం వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.

షెడ్యూల్ ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మే 19న ముగియగా… ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఏపీ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ఎల్లుండి నుంచి ప్రారంభిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 29 నుంచి జూన్ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన, జూన్ 1 నుంచి 6 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. 7న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 9న సీట్ల కేటాయింపు 15 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజులు జూన్ 1 లోగా చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news