కేసిఆర్ నీ లేకుండా చేయాలని సీఎం రేవంత్ కుట్ర.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

-

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ పర్యటనలో భాగంగా ఇవాళ అన్నారం బ్యారేజీ వద్ద బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన దేనికైనా ఒడిగడతారని మాకు అనుమానాలున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ను లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే కాళేశ్వరం ప్రాజెక్టును పడగొడితే సరిపోతుందని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి గతంలో ప్రగతి భవనన్ ని బాంబులతో పేలుస్తామని అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పై  అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. మెగాప్రాజెక్ట్ కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు సహజమని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందన్నట్లుగా కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నారం బ్యారేజీలో లోపాలుంటే సరిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించవచ్చని ఇంజనీర్లు చెప్పారని.. వర్షం కాలం వచ్చే లోపు కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీష్ రావు సీరియస్ అయ్యారు. తాము ఏదైనా కార్యక్రమం పెట్టిన రోజే.. ప్రభుత్వం మరో ప్రోగాం నిర్వహిస్తుందన్నారు. ప్రజాస్వామయ్యంలో ప్రతిపక్ష పార్టీలకు స్పేస్ ఇవ్వాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news