వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు : కేంద్ర మంత్రి శ్రీనివాస శర్మ

-

2024 పార్లమెంట్ ఎన్నికల్లో నర్సాపురం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రధాని మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆయన కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని చెప్పుకొచ్చారు.

పరిశ్రమలు రాణి కారణంగా యువత, ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించడానికి కొత్తగా ఏర్పాడే ప్రభుత్వం చిన్న, మధ్య, పెద్ద పరిశ్రమలను ప్రోత్సహించాలని కేంద్ర సహాయ మంత్రిగా భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలిపారు. కాగా ఈ నెల 12 న ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news