డ్రగ్స్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

-

డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం యుద్దం చేస్తుంది. ఈ యుద్దంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. స్ప్రై కెమెరాల గుర్తింపు పై శిక్షణ కార్యక్రమంలో  పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం ప్రమాదకరంగా మారింది. డ్రగ్స్ వల్ల యువత నీర్వీర్యం అవుతోంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మొదట స్పందించేది విద్యార్థులే అన్నారు. పిల్లలకు ఏది మంచో.. ఏది చెడో విద్యార్థులకు తెలియాలి. పిల్లల్ని మనం మానసికంగా సిద్దం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాల్లో పోలీసులు ఉండలేరు.

ఉద్యమంతో తెచ్చుకున్న రాష్ట్రం మనకండ్ల ముందే గంజాయికి బానిస అయింది. అన్ని కళాశాలలో ఎన్ఎస్ఎస్ ని ప్రోత్సహించాలని సూచించారు.పోలీసులు ఉండని చోట ఎస్ఎస్ఎస్ విద్యార్థులు పని చేయాలి. గంజాయి మత్తులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంటర్, డిగ్రీ కళాశాల పిల్లలతో పోలీసులు సమావేశమై గంజాయిని నిషేదించడానికి పలు కీలక సూచనలు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news