నిరుద్యోగులకు అలర్ఠ్.. గ్రూప్‌-2 పరీక్షపై కీలక ప్రకటన

-

నిరుద్యోగులకు అలర్ఠ్.. గ్రూప్‌-2 పరీక్షపై కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. గ్రూప్-2 పరీక్షను యదావిధిగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో ‘ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే….’రిక్రూట్మెంట్ దశలవారీగా చేయాలని ముందే చెప్పాం. ఒక అభ్యర్థి ఎక్కువ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చాం. నేను ఇంతకుముందే చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను రద్దు చేయడం సరికాదు. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలుకాదు. అలా చేస్తే ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news