ఖానామెట్‌ భూముల వేలంపై భారీ అంచనాలు

-

హైదరాబాద్‌ కోకాపేటలో ప్రభుత్వ భూములు భారీ ధర పలికాయి. కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లో మొత్తం 49 ఎకరాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసింది. ఈ భూములను మొత్తం 8 ప్లాట్లుగా విభజించి గురువారం ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించారు. ఒక ఎకరానికి కనీస ధరగా రూ.25 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించగా… సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది.

 

ఖానామెట్‌ భూముల వేలం |  Khanamet Land Auction
ఖానామెట్‌ భూముల వేలం | Khanamet Land Auction

కాగా ఈ వేలం ప్రక్రియలో 60 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. ఉదయం 4 ప్లాట్లను, మధ్యాహ్నం మరో 4 ప్లాట్లను వేలం వేశారు. ఇందులో గరిష్టంగా రాజపుష్ప ప్రాపర్టీస్‌ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున చెల్లించి… 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతం చేసుకున్నది. ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలికింది. ఈ భూముల అమ్మకం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం వచ్చింది.

ప్రభుత్వ భూముల వేలం శుక్రవారం కూడా కొనసాగనుంది. ఇవాళ ఖానామెట్‌ భూములకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించారు. మొత్తం 15.01 ఎకరాల భూమి అమ్మకానికి ఉండగా… వాటిని 5 ప్లాట్లుగా విభజించారు. నిన్నటి వేలంలో కోకాపేట భూములు అంచనాలకు మించి ధర పలికడంతో… ఖానామెట్‌ భూములపై కూడా భారీ అంచనాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news