Surekha Sikri : చిన్నారి పెళ్లి కూతురు బామ్మ సురేఖా సిక్రీ మృతి

-

చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్‌, జాతీయ అవార్డు గ్రహీత నటులు సురేఖా సిక్రీ మృతి చెందారు. 75 సంవత్సరాలు ఉన్న సురేఖా సిక్రీ ముంబైలో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సురేఖా సిక్రీ శుక్రవారం రోజున గుండె పోటుతో మృతి చెందారు.

సురేఖ మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2018 లో పక్షవాతంతో… 2020 లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో ఆమె బాధపడ్డారు. ఇక సురేఖా సిక్రీ ఏప్రిల్‌ 19 న 1945 లో జన్మించగా… 16 జూలై 2021 న మృతి చెందారు. సురేఖా సిక్రీ 1978 లో కిస్సా కుర్సి కా చిత్రంతో టీవీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

తమాస్‌, మమ్మో, బధాయ్‌ హో లాంటి సినిమాలోని నటనతో మూడు సార్లు జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుతో సహా పలు అవార్డులు అందుకున్నారు సురేఖా సిక్రీ. కాగా…. మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news