మూసి ప్రక్షాళనపై కిషన్ రెడ్డి సీరియస్..!

-

మూసి సుందరీ కరణ పేరుతో పేద ప్రజల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. 1,50,000 కోట్లతో ఏమి సుందరీకరణ చేస్తారు.. దీని వెనుక ఏదో ఉంది అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అనారోపించారు. కేసీఆర్ కూడా మూసి ప్రక్షాళన అన్నాడు… కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు… చేసింది ఏమి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అదే మాట మాట్లాడుతున్నారు.

అప్పుడు లక్ష 30 వేల కోట్లు కేసీఆర్ కాళేశ్వరం లో పెట్టారు. ఇప్పుడు లక్ష 50 వేల కోట్లు ఈయన మూసి లో పెడతారు అట. ఎవరి డబ్బులు అవి… మీ ఇళ్ల నుండి తీసుకొస్తున్నారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముందు రాష్ట్రంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అనే వాటి మీద దృష్టి పెట్టండి. పైసా పైసా కూడబెట్టుకొని ఇక్కడ ప్రజలు ఇల్లు కట్టుకున్నారు. నేను ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాను. అభివృద్ధి అంటే పేద ప్రజల ఇల్లు కూల్చడమా అని ప్రశ్నించిన కేంద్ర మంత్రి.. మూసి పరివాహక ప్రాంతం లో రిటైనింగ్ వాల్ కట్టండి అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news