కల్వకుంట్ల ఫ్యామిలీపై యుద్ధం మొదలైంది : కిషన్ రెడ్డి

-

బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్​పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ కార్యాలయం ముందు భారీగా పోలీసులను ఎందుకు మోహరించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదా అని నిలదీశారు. రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు వెళ్తే అడ్డుకుంటారా అని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం అభద్రతా భావంతో ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ సర్కార్ ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున కల్వకుంట్ల ఫ్యామిలీపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.

“నా జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదు. నేరస్థుడిలా చూస్తూ నన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతుంటే అరెస్టు చేస్తున్నారు. రాష్ట్ర తండ్రులను అడ్డుపెట్టుకుని మేం మంత్రులం కాలేదు. పేదల పక్షాన మాట్లాడే హక్కు మాకు ఉంది. ఆట మొదలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీనే. దమ్ముంటే కేసీఆర్‌ ప్రభుత్వం 50 లక్షల ఇళ్లు కట్టాలి. 50 లక్షల ఇళ్లు కడితే కేంద్రం నుంచి నేను నిధులు తెస్తా.” అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news