క్లీన్ కారా కోసం ప్రత్యేక గది.. ఉపాసన ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో తెలుసా..?

-

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్ 20వ తేదీన ఒక పాప జన్మించిన విషయం తెలిసిందే. ఇక నేటితో ఆ పాప పుట్టి నెల రోజులు అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ కూడా పాపకు సంబంధించిన ఏదో ఒక విషయం నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన తన గారాల పట్టి క్లీన్ కారా కోసం ఒక ప్రత్యేకమైన గదిని చాలా అద్భుతంగా ప్రశాంతంగా డిజైన్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. క్లీన్ కారా పుట్టినప్పటి నుండే ప్రశాంతమైన వాతావరణంలో పెరగాలని.. అందుకే ఆమె కోసం చాలా ఖర్చు చేసి మరి ఒక స్పెషల్ రూమ్ డిజైన్ చేయించిందని సమాచారం.

అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఇంటీరియర్ డిజైనర్స్ ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి వారి చేత డిజైన్ చేయించారట. రూమ్ మొత్తం వైట్ కలర్ తో బొమ్మలు అలాగే ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ గది కోసం ఉపాసన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ధర విషయానికి వస్తే.. సుమారుగా రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. చిన్న గది కోసం రూ.6 కోట్లు ఖర్చు పెట్టి రూమ్ డిజైన్ చేయించారని తెలిసి.. నెటిజన్స్ కూడా ఆ రూ.6 కోట్లతో పెద్ద భవననే కట్టవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ కూడా తమ కూతురు కోసం ఇప్పుడే ఈ రేంజ్ లో ఖర్చు పెట్టారంటే.. ఇక భవిష్యత్తు లో ఏ రేంజ్ లో ఖర్చు పెడతారో ఊహకు కూడా అందడం లేదు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి అయితే ఈ గది ధర తెలిసి అందరూ నోరెళ్ళబెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news