తెలంగాణ హైకోర్టులో మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 24గా ఉంది. ఈ సంఖ్యను 42కు పెంచాలని కిషన్ రెడ్డి న్యాయశాఖ మంత్రిని కోరారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే జడ్జిల సంఖ్యను పెంచాలని కిషన్ రెడ్డి కేంద్రన్యాయ శాఖ మంత్రిని కోరారు.
Called on Hon Law & Justice Minister Shri @rsprasad today, along with Sri @RaoMlc & TS Bar Council Chairman Sri Narsimha Reddy & requested for increasing strength of Judges from 24 (14 appointed) to 42 in the Telangana High Court & to fill in vacancies, for speedy justice. pic.twitter.com/g2EOXdwXSf
— G Kishan Reddy (@kishanreddybjp) August 26, 2020
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, ఇటీవలే కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాక్ హ్యాకర్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వెబ్‌సైట్‌లో ఆయన వ్యక్తిగత సమాచారం, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని కిషన్ రెడ్డి కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే.