చరిత్ర తెలుసుకొని మాట్లాడు.. కేటీఆర్ కి భట్టి స్ట్రాంగ్ కౌంటర్..!

-

హైదరాబాద్ ఐటీ రంగానికి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వేసిన పునాదులే కారణం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి పాల్గొని మాట్లాడారు. దేశంలో రాజీవ్ కంప్యూటర్ యుగాన్ని సృష్టించారని, ప్రతి పల్లెకు మంచి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్ తీసుకువచ్చింది, యువత దేశ పరిపాలనలో భాగస్వామ్యం కావాలని 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిందే రాజీవ్ గాంధీ అన్నారు.

పారిశ్రామిక విప్లవాన్ని మిస్ చేసుకున్నామని.. కానీ కంప్యూటర్ విప్లవాన్ని మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో ఆనాడు ప్రధాన మంత్రి హోదాలో  రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఐటీ సెక్టార్ కు పునాదులు వేశాయన్నారు. కొంత మంది గత చరిత్ర గురించి మరిచిపోయి మాట్లాడుతున్నారని కేటీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ ఐటీ సెక్టార్ లో ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతున్నాయంటే.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news