తెలంగాణలోని సంపదను రక్షించుకునేందుకే ఆంధ్ర నాయకులు బిఆర్ఎస్ లో చేరుతున్నారు – కోదండరాం

-

కృష్ణానది జలాల వాటా సాధనకై నాంపల్లి లోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం జలదీక్ష చేపట్టారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టుల త్వరగా పూర్తి చేయాలని కోరారు కోదండరాం. కృష్ణా, గోదావరి నదులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ను ఉపసంహరించుకోవాలని వాదించారు.

కృష్ణానది జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. టిఆర్ఎస్ తెలంగాణ గురించి మాట్లాడుతుందనే ఆశ ఉండేదని.. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పోయి బిఆర్ఎస్ అయిందని అన్నారు. ఈనెల 30వ తేదీన ఢిల్లీకి వెళ్లి తెలంగాణ వాటా తేల్చాలని కేంద్రాన్ని కోరుతామని వెల్లడించారు. తెలంగాణలోని సంపదను రక్షించుకునేందుకే ఆంధ్ర నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version