కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ

-

వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జైలు నుంచి ఆయన ఓ సంచలన లేఖ రాశారు.

జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చాడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.  పోలీసులు నా పేరుతొ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు నా నుంచి తీసుకోలేదు.  నేను వారికి చెప్పలేదు. కోర్టుకు వచ్చాక నా అడ్వొకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి వరకు నాకు అందులో ఏముందో తెలియదు” అంటూ లేఖ రాశారు పట్నం నరేందర్ రెడ్డి. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ అవుతోంది. మరోవైపు వికారాబాద్ కోర్టులో నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చరేశారు.

Read more RELATED
Recommended to you

Latest news