ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి మారాం చేయకూడదు అని అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. అయితే డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ వేసిన రఘురామ కృష్ణంరాజు నేడు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే డిప్యుటీ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత RRR మాట్లాడుతూ.. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఉపసభాపతిగా ఎలా ఉండాలో అలాగే ఉంటాను అని అన్నారు.
అయితే ఎక్కువ రోజులు ప్రతిపక్షం రావాలి.. వారికి మైక్ ఇవ్వడం జరుగుతుంది. సభలో ఎలాంటి చెత్త భాషను ప్రోత్సహించే వ్యక్తి కాదు సీఎం చంద్రబాబు. ఇక మారాం చేయడం మానేసి సభకు ప్రతిపక్షం రావాలి అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. సభలో ప్రతీ శాసన సభ్యుడికి మాట్లాడే అవకాశం రావాలి. అదే విధంగా మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన దానిపై చట్టం తీసుకు రావాలి. కచ్చితంగా సభలో చర్చించి పవన్ కళ్యాణ్ కోరిన చట్టం వచ్చేలా చేద్దాం అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.