రికార్డ్ స్థాయిలో ధరలు పలికిన కోకాపేట భూములు

-

నిధుల సమీకరణ కోసం హెచ్ఎండిఏ మరోసారి భూముల అమ్మక ప్రక్రియను గురువారం చేపట్టింది. అత్యంత ధర ఉన్న కోకాపేట్ లోని నియో పోలీస్ లే అవుట్ లోని మొత్తం 45.33 ఎకరాల భూమి అమ్మకానికి పెట్టింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు రికార్డు ధరలు పలికాయి. అత్యధికంగా ఎకరం భూమి రూ. 72 కోట్లు పలకగా.. అత్యల్పంగా 51.75 కోట్లు పలికింది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర 35 కోట్లు.

మొదటి విడతలో 26.86 ఎకరాలు వేలం వేయగా.. నాలుగు ఫ్లాట్లు రూ.1, 532.5 కోట్లు పలికాయి. అమ్మకానికి పెట్టిన కోకాపేట నియో పోలీస్ లేఔట్ లోని ప్లాట్ నెంబర్ 6లో 7 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 7 లో 6.55 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 8 లో 0.21 ఎకరాలు, ఫ్లాట్ నెంబర్ 9 లో 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 10 లో 3.60 ఎకరాలు, ఫ్లాట్ నెంబర్ 11 లో 7.53 ఎకరాలు, నాట్ నెంబర్ 14 లో 7.34 ఎకరాలతో కలిపి మొత్తం 45.33 ఎకరాల భూమిని విక్రయిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news