ఢిల్లీ ఆర్డినెన్సు రాజ్యాంగబద్ధమే : అమిత్ షా

-

గత కొద్దీ రోజుల నుండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఎన్నో బిల్లులను మరియు ప్రతిపాదనలను సభలో ప్రవేశ పెట్టింది. అందులో ఒకటి ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు… ఈ బిల్లు కనుక లోక్ సభలో పాస్ అయితే ఢిల్లీ పాలనాధికారులు అన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి, ఈ ఢిల్లీలో అధికారుల బదిలీలు మరియు ఇతర అధికారాలు అన్నీ మోదీ చేతికి వెలుతాయి. అలా జరగకుండా ఉండాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశమంతా తిరిగి వివిధ పార్టీల మద్దతును ఈ ఆర్డినెన్సు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని కూడగట్టుకున్నారు. అయినప్పటికీ సభలో ఎన్డీఏ కి ఉన్న బలంతో పోలిస్తే కేజ్రీవాల్ కు మద్దతుగా ఉన్న వారి బలం సరిపోదు. అయినప్పటికీ మీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొందరు ఉన్నారని తెలియచేయడానికి కేజ్రీవాల్ కృషిచేశారు. కాగా ఈ రోజు అమిత్ షా ఈ బిల్లుపై మాట్లాడుతూ ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు పూర్తిగా రాజ్యాంగం ప్రకారమే తీసుకువచ్చామని సభకు తెలియచేశారు. ఈ సందర్భంగా గతంలో నెహ్రు దేశ రాజధానికి సంపూర్ణ హోదాను వ్యతిరేకించిన విషయాన్నీ ముందుకు తీసుకువచ్చారు అమిత్ షా.

సుప్రీమ్ కోర్ట్ కూడా చట్టం చేసే అధికారం కేంద్రానికి ఉందని తీర్పు ఇచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు. మేము కేవలం ఢిల్లీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము .. అంతే కానీ ఆప్ కు మద్దతుగా ఉన్న INDIA కూటమి గురించి కాదని ఛలోక్తులు విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news