BREAKING : రేపు ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రేపు ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. స్వయంగా ఈ విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి చేపట్టడానికి ముందు..రేపు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు.
నిన్న హరీశ్ రావు రైతు బంధు ఏమైందన్నారు…మేము ప్రభుత్వం లోకి వచ్చి రెండు మూడు రోజులవుతుందన్నారు. మేము వాళ్లల విమర్శలు చేయం… మొదట పని చేస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని…రేపు ఎంపీ పదవికి రాజీనామా చేస్తా… నితిన్ గడ్కరీ అపాయింట్ మెంట్ తీసుకు వస్తానని చెప్పారు.
నాకున్న పరిచాయలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకు వస్తానని వెల్లడించారు. నా నియోజకవర్గ పరిధిలోని రోడ్లను 100 కోట్ల తో నాలుగు లైన్లుగా మార్చబోతున్నామని.. పదేళ్ళ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అమెరికా ఈజ్ గ్రేట్… అమెరికన్ రోడ్స్ ఈజ్ గ్రేట్… నాకు రోడ్లు భవనాలు శాఖ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.