టికెట్‌ రాలేదని పార్టీ మారొద్దు..నాకు పీసీసీ రాకపోతే మారానా ? : కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్‌ రాలేదని పార్టీ మారొద్దని..నాకు పీసీసీ రాకపోతే పార్టీ మారానా ? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయని కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు.

టికెట్ రాలేదని పార్టీ మారొదన్నారు. మంత్రి జగదీష్ రెడ్డీ.. ఎమ్మెల్యే కిషోర్ పై ఫైర్ అయ్యారు. ఇసుక దందా తో కోట్లు సంపాదిం చారు…. జగదీష్ రెడ్డీ… శంషాబాద్ లో ఫార్మ్ హౌస్ కట్టారని ఆరోపించారు.

ఎమ్మెల్యే కిషోర్ ఇసుక మాఫియా లో కూరుకుపోయారని..కేసీఆర్‌ కు దీటుగా జగదీష్ రెడ్డీ ఫార్మ్ హౌస్ ఉందని… ఇచ్చిన అన్ని హామీలు మర్చిపోయారని నిప్పులు చెరిగారు. జనం నమ్మే పరిస్థితి లేదు..అందుకే pk నీ తెచ్చుకున్నారని.. పార్టీలో టికెట్ వచ్చినా రాకున్నా కలిసి పని చేయాలని కోరారు. సర్వే ఆధారంగా టికెట్స్ ఇస్తామని.. నాక్కూడా అప్పట్లో సర్వే చేస్ టికెట్ ఇచ్చారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.