కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండేలు లేరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డి తో కలిసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు…అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని తెలిపారు.
ఏకనాథ్ షిండే ను సృష్టించిందే బిజెపి పార్టీ….హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి లు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. పనికిరాని చిట్ చాట్ లు బంద్ చేయాలని.. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే నేను దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దు…బండి సంజయ్ ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డి కి తెలుసా అని నిలదీశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎం గా ఉంటారు. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.