యూత్ కు HCA గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో మెగా సమ్మర్ క్రికెట్ క్యాంపులు జరుగనున్నట్లు కీలక ప్రకటన చేశారు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు. పేద క్రికెటర్లకు ఉచిత శిక్షణ కొరకు 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు సమ్మర్ క్రికెట్ క్యాంపులు జరుగుతాయని వివరించారు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.
ప్రతి జిల్లాకు 15 లక్షల నిధులు ఇచ్చి, ప్రతి జిల్లాలో 3 క్యాంపులు నిర్వహించి.. గ్రామాల్లోని క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ శిక్షణ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో కోచ్‌లు, పిజియోలు లేకుంటే హెచ్‌సీఏ తరుపున కోచ్‌లను, పిజియోలను పంపిస్తామని కీలక ప్రకటన చేశారు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.