BREAKING : ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్కు తిరిగివచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత నెలలో అంటే అక్టోబర్ 21వ తేదీన… ఆస్ట్రేలియా పర్యటనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు.

ఆయన వెళ్లిన వెంటనే… రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఆయన మాట్లాడిన ఓ వీడియో కూడా వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకు నోటీసులు జారీచేసింది. రేపటిలోగా ఆ నోటీసులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్కు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ఆ ఆడియో పై క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news