రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కొండా సురేఖ హాట్ కామెంట్స్

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైనే తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ… షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది మూర్ము వితంతు మహిళ అని మోడీ పిలవలేదన్నారు.

Konda Surekha hot comments on President Draupadi Murmu
Konda Surekha hot comments on President Draupadi Murmu

ఆమె దళిత మహిళ అని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. బీజేపీ నాయకులకు నరనరాల్లో కుల పిచ్చి పాతుకుపోయి ఉందన్నారు.

బీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ.. బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు కొండా సురేఖ. ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు..? బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడంతో పాటు రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు ప్రతి రాష్ట్రంలో కులగణన, జనగణన జరిగే వరకూ ఈ పోరాటం ఆగదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news