దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 4-0తేడాతో గెలుపొందింది. తొలి అర్ధభాగంలో 2-0తో ముందంజలో ఉన్న భారత్… సెకండ్ హాఫ్ లో మరో రెండు గోల్స్ చేయడంతో విజయం సాధించింది. ఇండియా ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి హ్యాట్రిక్ గోల్ చేయగా… ఉదంత కుమమ్ ఒక గోల్ కొట్టారు.
కాగా, భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి రికార్డు సృష్టించారు. నిన్న పాకిస్తాన్ పై హ్యాట్రిక్ గోల్స్ సాధించి అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్ర లో అత్యధిక గోల్స్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. రోనాల్డో (123 గోల్స్), రిటైర్డ్ ప్లేయర్ ఆలీ (109 గోల్స్), మెస్సి (103 గోల్స్) తర్వాత ఎక్కువ గోల్స్ (90) చేత్రివే. ఎక్కువ గోల్స్ చేసిన యాక్టివ్ ప్లేయర్లలో మూడో స్థానంలో ఉన్నారు.