పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ?

-

పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయను న్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ బరిలోకి బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లలో ఒకరు పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది.

మంగళవారం ప్రస్తుత ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలో దించాలని నిర్ణయించారు.పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధినేత కేసీఆర్ కొప్పుల ఈశ్వర్ కు సమాచారం అందించారు. సీపీఐ ఎంఎల్ నుంచి టీడీపీలో చేరిన అనంతరం కొప్పుల ఈశ్వర్ మొదటి సారిగా 1994లో మేడారం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు.

2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రారంభించిన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కొప్పుల ఈశ్వర్ 2004లో మేడారం అసెంబ్లీ స్థానం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 మేడారం, 2009, 2010లో ధర్మపురి నుండి వరుసగా విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం 2014లో విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్ గా చేశారు. 2018లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

విశేష రాజకీయ అనుభవంతో పాటు సింగరేణి కార్మికుల్లో మంచిపట్టున్న కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దించితే పెద్దపల్లి పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరవే యవచ్చని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈశ్వర్ అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కొప్పుల ఈశ్వర్ నూతన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version