అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళిపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై ప్రాథమిక స్థాయిలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రగతి భవన్ లో చర్చించుకున్నారు. సాయంత్రానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ తో రివ్యూ చేయనున్నారు. ఏయే నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా ఉన్నది.. ఎంత శాతం నమోదు అయింది. అనుకూల ప్రతికూలత అంశాలు ఎలా ఉన్నాయి.. ఎగ్జిట్ పోల్స్ లో వెలువడిన వివరాలతో పోల్చి సమీక్షించనున్నారు. ఈనెల 03న కౌంటింగ్ జరుగనుండటంతో తదుపరి కార్యచరణపై ఈ ముగ్గురూ సాయంత్రం మరింత లోతుగా రివ్యూ చేయనున్నారు.
ఒక్కో ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలు ఒక్కో తీరులో ఉండటంతో సొంత సర్వే సంస్థ వెల్లడించిన వివరాలు.. ఇంటెలిజెన్స్ రిపోర్టులను పరిగణలోకి తీసుకొని సమీక్షించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నియోజకవర్గాల వారీగా పోలింగ్ ట్రెండ్ ను పరిశీలించి బీఆర్ఎస్ కి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది. లబ్దిదారుల ఆలోచన ఏ తీరులో ఉన్నది తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.