తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిన్నటితో పూర్తయి పోయాయి. ఎన్నికల అనంతరం ఎక్జిట్ పోల్స్ తో రాష్ట్రము అంతటా కాంగ్రెస్ విజయ దుందుభి మోగిస్తుందని ఖరారు అయిపోయింది. కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీతో దక్కుతుందని కంఫర్మ్ చేశాయి, అయినప్పటికీ అధికారికంగా ఫలితాలు రావడానికి ఆదివారం వరకు ఆగాల్సిందే. ఇక ఖమ్మం నియోజకవర్గంపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ అధికార పార్టీ BRS తరపున పువ్వాడ అజయ్, కాంగ్రెస్ నుండి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. అయితే సర్వేల ప్రకారం కరెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేశాయి.. కానీ పువ్వాడ అజయ్ సైతం ఈ ఖమ్మంలో విజయం నాదే అంటూ చెప్పుకుంటున్నాడు. మరి ప్రజల అభిప్రాయం ప్రకారం ఎవరికీ ఇక్కడ ఎమ్మెల్యే సీటు దక్కనుంది అన్నది తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక అధికారం కూడా కాంగ్రెస్ కు దక్కడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.. దీనితో వరుసగా రెండు సార్లు సీఎంగా ఉన్న కేసీఆర్ కు బిగ్ షాక్ అని చెప్పాలి.