మహిళా వ్యాపారులకు సింగల్ విండో విధానం అమలు చేస్తాం: కేటీఆర్‌

-

మానవ వనరులు, సాంకేతికతను వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మెళకువలు నేర్పాలని చెప్పారు. ఆలోచించే విధానంలో మార్పు రావాలని అన్నారు. తప్పు జరిగితే మళ్లీ నేర్చుకుంటామని.. కానీ వెనుకాడవద్దని పేర్కొన్నారు.

హైదరాబాద్ తాజ్ కృష్ణాలో నిర్వహించిన వి హబ్ ఐదో వార్షికోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. రూ.1.30కోట్లు ఇస్తే వి హబ్ నుంచి ఒక స్టార్టప్‌తో రూ.70 కోట్లకు పెంచారని చెప్పారు. స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నామన్న మంత్రి.. యువత ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదని ప్రశ్నించారు.

‘ప్రతీ పారిశ్రామిక పార్క్‌లలో 10 శాతం ప్లాట్స్ మహిళలకు కేటాయించాం. ప్రతీ 3 కోవిడ్‌ టీకాల్లో రెండు హైదరాబాద్‌ నుంచి వచ్చాయి. మహిళా వ్యాపారులకు సింగల్ విండో విధానం అమలు చేస్తాం.’ – కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news