BREAKING: హుటాహుటిన అసెంబ్లీకి కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పయనం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కలవనున్నారు కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.
ఇందులో భాగంగానే అసెంబ్లీకి చేరుకున్నారు brs వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మిగతా ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన లపై స్పీకర్ ను కలవనున్నారు brs ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయింపుల పై కూడా మరోసారి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.
కాగా, బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ కు మరో బిగ్ షాక్ ఇస్తూ తాజాగా ఇంకో 8 మంది ఎమ్మెల్యేలు కారు దిగి చేయందుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, సంజయ్ కుమార్, మహిపాల్ రెడ్డిలు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.