కడప జడ్పీ పీఠం పై కన్నేసిన టిడిపి.. వైసీపీ అప్రమత్తం అవుతుందా..?

-

కడప జడ్పీలో తెలుగుదేశం పార్టీకి బలం లేదు.. జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుంటామనే ఆశ కూడా లేదు.. కానీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.. ఉప ఎన్నిక జరగబోయే రెండు జడ్పీటీసీ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ జిల్లా నేతలు దృఢ నిశ్చయంతో ఉన్నారట.. జడ్పీ పీఠాన్ని చేజిక్కించుకొని వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి..

tdp ysrcp

ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది.. ఇదే జోష్ లో జడ్పీలో కూడా పాగా వెయ్యాలని ఆ పార్టీ భావిస్తుంది.అందులో భాగంగానే జడ్పీ ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే ప్రచారం జరుగుతుంది.. ఒంటిమిట్ట మండలం నుంచి జడ్పీటీసీ గా గెలుపొయిందిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా.. కొనసాగుతూ వచ్చారు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో చైర్మన్ పదవికి రాజీనామా చేసారు.. పులివెందుల జడ్పీటీసీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దింతో ఒంటిమిట్ట తో పాటు పులివెందుల జడ్పిటిసి స్థానం ఖాళీ పడింది.. ఈ రెండు చోట్ల గెలుపొందడంతోపాటు..

జడ్పీ చైర్మన్ స్థానాన్ని సైతం కైవసం చేసుకోవాలని కడప జిల్లా టిడిపి నేతలు పావులు కదుపుతున్నారట.. అసంతృప్తిగా ఉన్న జడ్పీటీసీలతో టీడీపీ నేతలు ఇప్పటికే మంతనాలు సైతం జరిపారని టిడిపిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది… అభివృద్ధి పనుల్లో తమకు అడ్డంకి లేకుండా ఉండాలంటే పిఠాన్ని ఛేజికించుకోవడమే ఏకైక మార్గంగా టీడీపీ నేతలు బావిస్తున్నారు.. అందుకోసమే జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో అడుగులేస్తున్నారని తెలుస్తోంది.. తమ పార్టీ అప్రమత్తం కాకపోతే కడప జడ్పీ స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని వైఎస్ఆర్ సీపీ నేతలు చర్చించుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news