రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివైతే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి.. ఎన్నికలకు రా అంటూ గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ చేశారు. ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజీకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటదన్నారు కేటీఆర్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హల్ లో BRS కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం హాజరైన మాజీమంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్..ఈ సందర్భంగా మాట్లాడారు.
జగిత్యాల లో ఈ హౌలే గాన్ని ఎమ్మెల్యేను చేసింది ఎవరు.? అంటూ ఫైర్ అయ్యారు. జగిత్యాలను జిల్లా చేసింది మెడికల్ కాలేజీ తీసుకువచ్చింది కేసీఆర్ అని… అలాంటి జిల్లాను మెడికల్ కాలేజీని రద్దు చేస్తామన్న పార్టీలోకి సంజయ్ కుమార్ వెళ్ళాడని ఆగ్రహించారు. సొంత ప్రయోజనాలు నాలుగు డబ్బులు సంపాదించుకునేందుకే పార్టీ మారాడు సంజయ్ అంటూ నిప్పులు చెరిగారు. జగిత్యాల ఎమ్మెల్యే బండగట్టుకుని బాయిల దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించారు కేటీఆర్.