కవితక్క కూడ వస్తది… జగిత్యాలలో గల్లి గల్లి తిరుగుతామన్నారు కేటీఆర్. జగిత్యాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… జగిత్యాల ఎమ్మెల్యే బండగట్టుకుని బాయిల దూకి ఆత్మహత్య చేసుకున్నాడు….గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు గడ్డి పోచలే కొట్టుకుపోతాయన్నారు. పార్టీ మారిన సంజయ్ కుమార్ దమ్ముంటే రాజీనామా చేసి పోటికి రావాలని సవాల్ విసిరారు.
గతంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అందరూ రాజ్యాంగబద్ధంగానే చేరారు….సింగరేణి ప్రైవేటు పరం చేయబోమని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి సమక్షంలోనే బొగ్గు గనులు వేలం జరిగిందని…. 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని ఆగ్రహించారు. హామీల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు…. కాంగ్రెస్ పెన్షన్ల పెంపు జరగలేదు, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇవ్వలేదు.. గృహలక్ష్మి అమలు చేయలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడో వంతు సీట్లు గెలిచాం.14 చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని గుర్తు చేశారు కేటీఆర్.