తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో అన్నారు. ‘సీఎం కేసీఆర్ ను బూతులు తిట్టే జర్నలిస్టులు… యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మేం మౌనంగా ఉన్నాం. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కూడా సీఎంను బూతులు తిడతారు. అయినా సంయమనంతో వ్యవహరిస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితుల్లో ఉన్నాయా? ప్రతి వెధవ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? అని ఫైర్ అయ్యారు.
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అంశాలపై జర్నలిస్టులు మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించగా… ఆయన స్పందించలేదు. ‘పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాకు ఎలాంటి సంబంధం లేదు. అది వారి తలనొప్పి. మాకు సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 కి పైగా స్థానాల్లో గెలిచి, మరోసారి అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నకలలో ప్రతిపక్షాలకు డిపాజిట్స్ దక్కవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.