దారి తప్పిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చినట్టు ఉంది..జిట్టాపై కేటీఆర్‌ కామెంట్స్‌

-

బాలకృష్ణారెడ్డి దారి తప్పిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చినట్టు ఉందని కామెంట్స్‌ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు జిట్టా బాలకృష్ణ రెడ్డి, మామిల్ల రాజేందర్. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతూ.. డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవం త్ రెడ్డి కేసీఆర్ ను గన్ పార్కు దగ్గరకు రమ్మని సవాల్ చేస్తున్నారు…నవ్వాలా సావాలా అర్ధం కావడం లేదని ఫైర్‌ అయ్యారు.

అమర వీరులుగా మార్చిన వారే అమరవీరుల స్థూపం దగ్గరకు రమ్మంటారు..బీ ఆర్ ఎస్ ఎవ్వరికీ బీ టీం కాదు ..తెలంగాణ కు ఏ టీం ..అవ్వల్ దర్జా టీం అన్నారు. రేవంత్ ఆనాడు సోనియా ను బలి దేవత అన్నాడు ..ఇపుడు కాళీ దేవత అంటున్నాడని సెటైర్లు పేల్చారు…రేవంత్ ఆనాడు రాహుల్ ను ముద్ద పప్పు అన్నాడు ..ఈనాడు నిప్పు అంటున్నాడు..రేవంత్ మారినప్పుడల్లా మనం మారాలా ? అని ప్రశ్నించారు. బీసీ ల జనగణన పై రాహుల్ ఇప్పుడు మాట్లాడుతున్నారు…తొమ్మిది నెలల క్రితం మేము బీసీ జన గణన చేయాలని అసెంబ్లీ లో తీర్మానం చేసి పంపాము..రాహుల్ కు ఇపుడు బీసీ గణన గుర్తుకొచ్చిందని ఫైర్‌ అయ్యారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version