Telangana: వైద్య ఆరోగ్య పరిస్థితులపైన కేటీఆర్ కమిటీ..తాటికొండ రాజయ్యకు ఛాన్స్ !

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువా ఆసుప్రతులన్నింటిని భ్రష్టు పట్టించారని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ముక్యంగా హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో మరణాల రేటు ఎక్కువగా పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో శిశువు, తల్లిలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మరణించారు.అదేవిధంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఏ ఆసుపత్రి చూసినా రోగులు ఎక్కువగా కనిపిస్తున్నారు. దోమలను అరికట్టేందుకు ఫాగింగ్ చేపట్టడం లేదని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులపైన ముగ్గురితో బిఆర్ఎస్ కమిటీ నియమించారు వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని  పలు ఆసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది ఈ కమిటీ. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ లతో త్రీ సభ్య కమిటీ ని ఏర్పాటు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news